ఒక నిమిషం చదవండి
యేసుక్రీస్తు కడవరి దిన పరిశుద్ధుల సంఘం (The Church of Jesus Christ of Latter-day Saints) సేవకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యంగ్ ఉమెన్ విభాగం కోసం కొత్త మార్పులను ప్రకటించారు. ఈ మార్పులు యువతులకు గుర్తింపు (identity) మరియు ఉదేశ్యం (purpose) మరియు సంఘంలో అందరితో కలిసి ఉన్నామనే భావాన్న(belonging) పెంచడానికి తీసుకొని వచ్చారు.
కొత్తగా వచ్చిన పేర్లు:
1. ఫెయిత్ బిల్డర్స్ (Builders of Faith): 12 – 13 సంవత్సరాలు నిండుతున్న యువతులు
ఒక ‘ఫెయిత్ బిల్డర్స్’ (విశ్వాసాన్ని నిర్మించే యువతి), యేసుక్రీస్తుపై తనకు ఉన్న నమ్మకం ద్వారా దేవుని రాజ్యాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది. ఆమె ఎల్లప్పుడూ క్రీస్తుకు సాక్షిగా ఉంటూ, తన పనుల ద్వారా ఇతరులను ప్రోత్సహిస్తుంది మరియు వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది (ఎఫెసీయులకు 2:20 చూడండి).
2. మెసెంజర్స్ ఆఫ్ హోప్ (Messengers of Hope): 14 – 15 సంవత్సరాలు నిండుతున్న యువతులు
ఒక ‘మెసెంజర్ ఆఫ్ హోప్’ (నమ్మకం పంచే దూత), అలసిపోయిన వారికి యేసుక్రీస్తు అందించే నమ్మకం(hope) అనే సందేశాన్ని అందజేస్తుంది. ఆమె శాంతిని గూర్చి మాట్లాడుతుంది, ఇతరులకు ఓదార్పునిస్తుంది మరియు పవిత్రాత్మ శక్తి ద్వారా ఇతరుల హృదయాల్లో ఉత్సాహాన్ని నింపుతుంది (మోషైయ 18:8–9 చూడండి).
3. గాథరర్స్ ఆఫ్ లైట్ (Gatherers of Light): 16 అంతకంటే ఎక్కువ వయస్సు దాటుతున్న యువతులు
ఒక ‘గాథరర్ ఆఫ్ లైట్’ (వెలుగును సమకూర్చే యువతి), దేవుని నడిపింపును నమ్ముతుంది. ఆమె దేవునితో చేసుకున్న నిబంధనల ద్వారా శక్తిని పొందుతూ, దేవుని వెలుగును వెతుకుతుంది, దానిని సమకూర్చుకుంటుంది మరియు ఆ వెలుగును ఇతరులకు ప్రతిబింబిస్తుంది సిద్ధాంతము మరియు నిబంధనలు(doctrine and covenants) 50:24 చూడండి.

అధికారిక ఉత్తరం ప్రకారం, ఈ పేర్ల వల్ల ప్రతి యువతి కూడా దేవుని పనిలో తన స్థానాన్ని గుర్తుంచుకుంటుంది. ఆమె దేవుని కుమార్తె అని, తన ఆధ్యాత్మిక ఎదుగుదల ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
ఈ మార్పు కేవలం పేర్లకే కాదు, సంస్థ పనితీరులో కూడా ఉంది. జూన్ 1, 2026 నుండి, యంగ్ ఉమెన్ ఇకపై ‘క్లాస్’ పద్ధతిలో ఉండదు. కేవలం ‘వయస్సు గ్రూపుల’ (Age Groups) ఆధారంగానే ఉంటుంది. ఆ సంవత్సరంలో వారికి వచ్చే వయస్సును బట్టి వారు వేరే ఒక గ్రూపులోకి వెళ్తారు.
వయస్సు గ్రూపులు వేరుగా ఉన్నా, నాయకులు ప్రార్థన చేసి కార్యక్రమాలను అనుకూలంగా నిర్వహించుకోవచ్చు. యువతులు తక్కువగా ఉన్న చోట అందరూ కలిసే మీటింగ్స్ జరుపుకోవచ్చు. ఈ మార్పు వల్ల ప్రతి యువతి కూడా సంఘంలో తాను ఒక ముఖ్యమైన భాగమని భావించాలి.
మీరు అడుగుతున్న ప్రశ్నలు :

కొత్త పేర్లను ఎప్పటి నుండి వాడాలి?
మీరు ఇప్పుడే మీటింగ్స్‌లో, కార్యక్రమాల్లో మరియు రోజువారీ మాటల్లో ఈ పేర్లను వాడటం మొదలుపెట్టవచ్చు. జూన్ 1, 2026 వరకు ఆగాల్సిన అవసరం లేదు. కానీ ఆఫీసు రికార్డులలో (LCR) మాత్రం జూన్ 1న మార్పులు కనిపిస్తాయి.
పాత ప్రెసిడెన్సీలను మార్చాలా?
అవసరం లేదు. ఒకవేళ ఆ ప్రెసిడెన్సీ వారు అదే వయస్సు విభాగంలో ఉంటే సేవ కొనసాగించవచ్చు. వయస్సు మారితే మాత్రం బిషప్రిక్ కొత్త వారిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
క్లాస్‌కు మరియు వయస్సు గ్రూపుకు తేడా ఏంటి?
ఇదివరకు ఒక్కో చోట ఒక్కోలా ఉండేది. ఇప్పుడు మాత్రం ప్రపంచం మొత్తం ఒకేలా ఉంటుంది. కేవలం వయస్సు ఆధారంగానే గ్రూపులు ఉంటాయి. దీనివల్ల అంతటా ఒకే పద్ధతి ఉంటుంది.
మునుపటిలాగే నిర్వహించవచ్చా?
లేదు. పాత ‘క్లాస్’ పద్ధతి ఇకపై ఉండదు. ప్రతి వయస్సు గ్రూపు విడిగా ఉండాలి మరియు దానికి స్వంత నాయకత్వం ఉండాలి. అవసరమైనప్పుడు మాత్రం అందరూ కలిసే క్లాసులు లేదా పనులు చేసుకోవచ్చు.
యువతులు తక్కువగా లేదా ఎక్కువగా ఉంటే ఏమవుతుంది?
యువతులు తక్కువగా ఉన్నా, ఒక్కరు ఉన్నా సరే ఆ వయస్సు గ్రూపు ఉంటుంది. ఆ ఒక్కరే ప్రెసిడెంట్‌గా కూడా ఉండవచ్చు. సభ్యులు చాలా ఎక్కువ ఉంటే ఆ గ్రూపును రెండుగా విడదీయవచ్చు.
యూత్ కౌన్సిల్ (Youth Council) లో ఎవరు ఉంటారు?
ప్రతి వయస్సు గ్రూపు యొక్క ప్రెసిడెంట్ ఇందులో పాల్గొంటారు. దీనివల్ల అందరికీ తమ మాట చెప్పే అవకాశం ఉంటుంది.
పెద్దవారు (Adult Leaders) ఎలా సహాయం చేస్తారు?
- యంగ్ ఉమెన్ ప్రెసిడెంట్: 16 ఏళ్లు పైబడిన వారికి సహాయం చేస్తారు.
- మొదటి కౌన్సలర్: 14–15 ఏళ్ల వారికి సహాయం చేస్తారు.
- రెండో కౌన్సలర్: 12–13 ఏళ్ల వారికి సహాయం చేస్తారు.
- అవసరమైతే అడ్వైజర్లను కూడా తీసుకోవచ్చు.
వయస్సు గ్రూపు ఎప్పుడు మారుతుంది? ఆ యువతికి 12, 14 లేదా 16 ఏళ్లు వచ్చే సంవత్సరంలో, జనవరి నెలలోనే గ్రూపు మారుతుంది. దీనివల్ల అందరూ క్రమ పద్ధతిలో తమ గ్రూపులలో ఎదుగుతారు.

గతాన్ని గుర్తు చేసే మార్పు:
2019 తర్వాత గ్రూపుల కోసం ప్రత్యేక పేర్లను తిరిగి తీసుకురావడం ఇదే మొదటిసారి. ఆ సంవత్సరంలో ‘బీహైవ్’ (Beehive )’మియా మెయిడ్’ (Mia Maid) మరియు ‘లారెల్స్’ (Laurels) వంటి పేర్లను తీసేశారు. అంతకుముందు 1950 ప్రాంతంలో కూడా ‘యంగ్ గాదరర్’ వంటి పేర్లు ఉండేవి.
2025లో జరిగిన ఒక కార్యక్రమంలో, యంగ్ ఉమెన్ జనరల్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, నేటి కష్టమైన ప్రపంచంలో యువతులు తమను తాము దేవుని బిడ్డలుగా గుర్తించుకోవడమే అతిపెద్ద సవాలు అని చెప్పారు. ఈ మార్పు కేవలం పేర్లను తెచ్చుకోవడం మాత్రమే కాదు, ప్రతి యువతి కూడా తాను దేవుని పనిలో ఒక ముఖ్యమైన భాగమని గుర్తించేలా చేయడం దీని లక్ష్యం.
ఆధారం(Source): newsroom.churchofjesuschrist.org & Church News
Related Video:
