1నిమిషం చదవండి

ఆగస్టు 1, 2026 నుండి బాధ్యతలు చేపట్టనున్న కొత్త ప్రైమరీ జనరల్ ప్రెసిడెన్సీ

లెఫ్ట్ నుండి రైట్ కు: నినా ఎమ్. గార్ఫీల్డ్ మొదటి కౌన్సిలర్, రోజ్మేరీ కె. చిబోటా ప్రెసిడెంట్, మరియు తెరెసా ఎ. కాలిన్స్ రెండవ కౌన్సిలర్.

ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్-డే సెయింట్స్ యొక్క 196వ వార్షిక జనరల్ కాన్ఫరెన్స్ శనివారం మధ్యాహ్నం సెషన్‌లో కొత్త ప్రైమరీ జనరల్ ప్రెసిడెన్సీ వివరాలను వెల్లడించారు. చర్చి పెద్దలను సస్టైనింగ్ సెషన్లో మొదటి ప్రెసిడెన్సీకి చెందిన ప్రెసిడెంట్ డి. టాడ్ క్రిస్టోఫర్సన్ ఈ విషయాన్ని తెలియజేశారు.

కొత్తగా ఎంపికైన వారు ఎవరంటే: రోజ్మేరీ కె. చిబోటా ప్రెసిడెంట్, నినా ఎమ్. గార్ఫీల్డ్ మొదటి కౌన్సిలర్, మరియు తెరెసా ఎ. కాలిన్స్ రెండవ కౌన్సిలర్. కొత్త ప్రెసిడెన్సీ సభ్యులు ఆగస్టు 1, 2026 నుండి తమ సేవను ప్రారంభిస్తారు.

న్యూస్‌రూమ్ ఏప్రిల్ 2026 జనరల్ కాన్ఫరెన్స్ సెషన్ వివరములు, వార్తలు మరియు విశేషాలు

ప్రైమరీ అనేది 18 నెలల నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం ఉన్న ఒక సంస్థ. ఇది వారికి యేసుక్రీస్తు సువార్తను బోధిస్తుంది మరియు వారు విశ్వాసాన్ని పెంచుకోవడానికి సహాయపడుతుంది. చర్చి అంతటా ఉన్న పిల్లలను మరియు కుటుంబాలను బలపరచడానికి ప్రైమరీ జనరల్ ప్రెసిడెన్సీ పనిచేస్తుంది. ప్రైమరీ జనరల్ ప్రెసిడెన్స సభ్యులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రైమరీ బాధ్యులను మరియు పిల్లలను కలుసుకుని, వారికి బోధిస్తారు. పిల్లలు మరియు కుటుంబాలకు సేవ చేసే క్రమంలో వీరు ఇతర జనరల్ మరియు స్థానిక చర్చి పెద్దలతో కలిసి చర్చిస్తారు.

వారి పూర్తి జీవిత వివరములు:

రోజ్మేరీ కె. చిబోటా

 Rosemary K. Chibota, Primary General President (effective August 1, 2026).2026 by Intellectual Reserve, Inc. All rights reserved.

రోజ్మేరీ కె. చిబోటా, ప్రైమరీ జనరల్ ప్రెసిడెంట్ (ఆగస్టు 1, 2026 నుండి అమలులోకి వస్తుంది).

58 ఏళ్ల రోజ్మేరీ కె. చిబోటాది మలావి మూలం, ఆమె జింబాబ్వేలో పెరిగారు. ఆమె ఇప్పుడు యూటలోని సౌత్ జోర్డాన్‌లోలో నివసిస్తున్నారు. ఆమె చర్చి కోసం హ్యూమన్ రిసోర్సెస్(హెచ్ ర్ ) జనరలిస్ట్‌గా పనిచేస్తున్నారు, అలాగే గతంలో ‘కోరమ్ ఆఫ్ ది సెవెంటీ’ ఆఫీసులో సీనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆమె వెస్ట్రన్ గవర్నర్స్ విశ్వవిద్యాలయం నుండి మేనేజ్‌మెంట్ మరియు లీడర్‌షిప్‌లో మాస్టర్స్ డిగ్రీని, మరియు కొలరాడో టెక్నికల్ యూనివర్సిటీ నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు.

ఆమె ప్రస్తుతం సండే స్కూల్ టీచర్‌గా, మరియు తన భర్తతో కలిసి స్టేక్ మిషన్ ప్రిపరేషన్ ఇన్‌స్ట్రక్టర్‌గా సేవ చేస్తున్నారు. ఆమె గతంలో చర్చిలో వార్డ్ యాక్టివిటీస్ చైర్, వార్డ్ రిలీఫ్ సొసైటీ ప్రెసిడెన్సీ, ప్రైమరీ టీచర్, వార్డ్ ప్రైమరీ ప్రెసిడెన్సీ, సెమినరీ టీచర్, డిస్ట్రిక్ట్ యంగ్ ఉమెన్ ప్రెసిడెంట్, రిలీఫ్ సొసైటీ టీచర్ మరియు బ్రాంచ్ యంగ్ ఉమెన్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె మరియు ఆమె భర్త జోయెల్, 2022 నుండి 2025 వరకు అలబామా బర్మింగ్‌హామ్ మిషన్‌లో మిషన్ బాధ్యులుగా కలిసి సేవ చేశారు. వారికి ఒక బిడ్డ ఉన్నారు.

నినా ఎమ్. గార్ఫీల్డ్

Nina M. Garfield, First Counselor in the Primary General Presidency (effective August 1, 2026).2026 by Intellectual Reserve, Inc. All rights reserved.

నినా ఎమ్. గార్ఫీల్డ్, ప్రైమరీ జనరల్ ప్రెసిడెన్సీలో మొదటి కౌన్సిలర్ (ఆగస్టు 1, 2026 నుండి అమలులోకి వస్తుంది).

67 ఏళ్ల నినా ఎమ్. గార్ఫీల్డ్ యూటాలోని ఒరెమ్‌లో నివసిస్తున్నారు. ఆమె జపాన్‌లో ఒక జపనీస్ తల్లికి మరియు అమెరికన్ తండ్రికి జన్మించారు. ఆమె మంచి స్నేహితులు మరియు వారి కుటుంబాల ప్రభావంతో హైస్కూల్‌లో చదువుతున్నప్పుడు చర్చిలో చేరారు. ఆమె ఒక గృహిణి మరియు బ్రిగమ్ యంగ్ విశ్వవిద్యాలయంలోబివైయూ చదువుకున్నారు.

సిస్టర్ గార్ఫీల్డ్ ప్రస్తుతం స్టేక్ రిలీఫ్ సొసైటీ ప్రెసిడెంట్‌గా సేవ చేస్తున్నారు. ఆమె గతంలో చర్చిలో వార్డ్ రిలీఫ్ సొసైటీ ప్రెసిడెంట్, స్టేక్ ప్రైమరీ ప్రెసిడెన్సీ, వార్డ్ ప్రైమరీ ప్రెసిడెన్సీ, స్టేక్ రిలీఫ్ సొసైటీ ప్రెసిడెన్సీ మరియు స్టేక్ రిలీఫ్ సొసైటీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె మరియు ఆమె భర్త డేవిడ్ ఆయన స్వర్గస్తులయ్యారు వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు.

తెరెసా ఎ. కాలిన్స్

Theresa A. Collins, Second Counselor in the Primary General Presidency (effective August 1, 2026)  2026 by Intellectual Reserve, Inc. All rights reserved..

ఎ. కాలిన్స్, ప్రైమరీ జనరల్ ప్రెసిడెన్సీలో రెండవ కౌన్సిలర్ (ఆగస్టు 1, 2026 నుండి అమలులోకి వస్తుంది).

64 ఏళ్ల తెరెసా ఎ. కాలిన్స్ యూటలోని డ్రేపర్‌లో నివసిస్తున్నారు. ఆమె ఒక గృహిణి మరియు యూట స్టేట్ విశ్వవిద్యాలయంలో స్పెషల్ ఎడ్యుకేషన్ చదివారు. ఆమె ప్రస్తుతం నర్సరీ లీడర్‌గా, టెంపుల్ ఆర్డినెన్స్ వర్కర్‌గా మరియు తన భర్తతో కలిసి స్టేక్ మిషన్ ప్రిపరేషన్ ఇన్‌స్ట్రక్టర్‌గా సేవ చేస్తున్నారు.

ఆమె గతంలో చర్చిలో స్టేక్ యంగ్ ఉమెన్ ప్రెసిడెన్సీ, వార్డ్ రిలీఫ్ సొసైటీ ప్రెసిడెంట్, వార్డ్ యంగ్ ఉమెన్ ప్రెసిడెంట్ మరియు వార్డ్ ప్రైమరీ టీచర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె మరియు ఆమె భర్త రిచర్డ్, 2021 నుండి 2024 వరకు అర్కాన్సాస్ బెంటన్‌విల్లే మిషన్‌లో మిషన్ బాధ్యులుగా కలిసి సేవ చేశారు. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు.

సంబంధించిన ఆధారాలు: newsroom.churchofjesuschrist.org , Church News