వ్యక్తిగత అధ్యయనం
4 నిమిషాలు చదవండి
బైబిల్ విశ్వాసం గురించి బోదిస్తుంది, మనం దానిని ఎలా పొందగలమో, దానిని ఎలా పెంపొందించుకోగలమో, మరియు అత్యంత కష్ట సమయాలలో అది మన జీవితాలను ఎలా ఆశీర్వదించగలదో బోధిస్తుంది.
మనం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, దేవునిపైనా, యేసుపైనా విశ్వాసం ఉంచడం దేనినైనా అధిగమించడానికి మనకు సహాయపడుతుంది.
యేసు క్రీస్తు మాదిరిని అనుసరించడానికి ప్రయత్నించే వారికి ఇవ్వబడిన వాగ్దానాలను తెలుసుకోవడంలో మీకు సహాయపడటానికి, మరియు మీకు సలహా, ప్రోత్సాహం ఇవ్వడానికి ఉపయోగపడే 20 బైబిల్ వచనాలను ఇక్కడ మేము పంచుకుంటున్నాము.
విశ్వాసం అంటే ఏమిటి?

1. హెబ్రీయులకు 11:1
“విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది.”
2. 2 కొరింథీయులకు 5:7
“వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొనుచున్నాము.”
3. రోమా 10:8–9
“అదేమని చెప్పుచున్నది? వాక్యము నీయొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది; అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. అదేమనగా–యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు”.
మీ విశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి?

4. రోమా 10:17
“కాగా వినుటవలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తునుగూర్చిన మాటవలన కలుగును.”
5. హెబ్రీయులకు 11:6
“విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా”
6. యాకోబు 2:17
“ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును.”
దేవునికి దగ్గరగా ఉన్నట్లు భావించడానికి విశ్వాసం ఎందుకు అవసరం?

7. హెబ్రీయులకు 11:6
“విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా”
8. 1 కొరింథీయులకు 4:2
“మరియు గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడైయుండుట అవశ్యము”.
9. రోమా 14:23
“అనుమానించువాడు తినినయెడల విశ్వాసము లేకుండ తినును, గనుక దోషియని తీర్పునొందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము.”
10. కీర్తన 31:23
“యెహోవా భక్తులారా, మీరందరు ఆయనను ప్రేమించుడి యెహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతికారము చేయును”.
విశ్వాసం ఏమి చేయగలదు?

11. మత్తయి 17:20
“అందుకాయన–మీ అల్పవిశ్వాసము చేతనే; మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల ఈ కొండను చూచి–ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును; మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను.”
12. మత్తయి 21:21
“అందుకు యేసు–మీరు విశ్వాసముగలిగి సందేహపడకుండినయెడల, ఈ అంజూరపుచెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పినయెడల, ఆలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”
13. 1 యోహాను 5:4
“దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే”.
మీ సవాళ్లను ఎదుర్కోవడంలో విశ్వాసం మీకు ఎలా సహాయపడుతుంది?

14. జాషువా 1:9
“నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును.”
15. రోమా 5:1
“కాబట్టి, మనము విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియున్నాము
16. యాకోబు 1:3
“నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి…”
విశ్వాసం అద్భుతాలు చేయగలదా?

17. మార్కు 5:34
“అందుకాయన – కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను.”
18. మత్తయి 9:28–30
“ఆయన యింటికి వచ్చిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు–నేను ఈ కార్యము చేయగలనని మీరు నమ్ముచున్నారా? అని వారిని అడుగగా, వారు–నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి.” “అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టుకొని–మీ విశ్వాసము చొప్పున మీకు అవును గాక అని చెప్పెను.” “వెంటనే వారి కన్నులు తెరవబడెను. అయితే యేసు–ఇది యెవరికిని తెలియకుండ చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.”
19. మార్కు 10:51–52
“యేసు–“నేను నీకేమి చేయగోరుచున్నావని” వానినడుగగా, ఆ గ్రుడ్డివాడు–“బోధకుడా, నాకు దృష్టి కలుగజేయుమని” ఆయనతో అనెను. అందుకు యేసు–“నీవు వెళ్లుము; నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని” చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయనవెంట చూపుపొంది వెళ్లెను
20. యాకోబు 5:15
“విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును”
మూలం: churchofjesuschrist.org
మీకు ఇవి కూడా ఆసక్తికరంగా ఉండవచ్చు:
